పర్యాటకులను అలరించడానికి ప్రపంచంలో పలు చోట్ల మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం లు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ మ్యూజియం లలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారుల మైనపు ప్రతిమలు కొలువుతీరతాయి. ఇప్పుడు ఆ అరుదైన గౌరవం స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Gorgeous @MsKajalAggarwal is the 1st ever female actress and only the 3rd Actor from South India to have a Wax Statue at #MadameTussauds. It’s getting unveiled tomorrow. How excited are you? pic.twitter.com/0agetuwL2Q
— Telugu FilmNagar (@telugufilmnagar) February 4, 2020
[custom_ad]




టాలీవుడ్, కోలీవుడ్ లలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మైనపు ప్రతిమ సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం లో కొలువుతీరనుంది. కాజల్ అగర్వాల్ తన మైనపు ప్రతిమను ఫిబ్రవరి 5వ తేదీ తానే ఆవిష్కరించనున్నారు. సౌత్ ఇండియా నటీమణులలో ఈ అరుదైన గౌరవం పొందిన ఫస్ట్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్. మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం లో సౌత్ ఇండియా నుండి మైనపు ప్రతిమ అవకాశం పొందిన 3వ తార కాజల్. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ .. చిన్నప్పుడు మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం సందర్శించానని, అక్కడ ఉన్న మైనపు ప్రతిమలు తనను ఆకర్షించాయని, ఇప్పుడు తనకు ఈ అరుదైన గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: