‘జాను’ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. రేపు వైజాగ్, ఎ.యు. సిరిపురంలోని ‘సర్ సి ఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్’ లో సాయంత్రం 5 గంటల నుండి ఈ ఈవెంట్ ను జరపనున్నారు.

[custom_ad]

కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 15 =