ఫస్ట్‌ ఫిమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ…!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘వెంకీమామ’ సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రోల్ ను తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జయంత్ పరాన్జీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా ‘నరేంద్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నూతన నటుడు నిలేష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాలో ఇండియన్‌ ఫస్ట్‌ ఫిమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది. ఇంకా ఈ సినిమాలో ఇజబెల్లె నటిస్తుంది. మానవహక్కుల కార్యకర్తగా ఆమె నటిస్తుంది. ఆఫ్ఘన్ ఖైదీ గా ఫేమస్ ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ స్టార్ ద గ్రేట్ ఖలి నటిస్తున్నారు.

[custom_ad]

కాగా ‘పాకిస్థాన్‌ జైలులో బందీ అయిన ఓ భారతీయ బాక్సర్‌ కథ ఇది. శత్రుదేశం నుంచి తప్పించుకున్న ఆ బాక్సర్‌ ఎలా మాతృభూమికి చేరుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + six =