సక్సెస్ ఫుల్ మూవీ “రన్ రాజా రన్ ” తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సుజీత్, ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో “సాహో ” మూవీ ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో తన రెండవ సినిమా గా రూపొందించారు. స్టైలిష్ మూవీ గా తెరకెక్కిన “సాహో ” మూవీ మాస్ ప్రేక్షకులను అలరించి కమర్షియల్ గా విజయం సాధించింది. ఇప్పుడు సుజీత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మూవీ ని రూపొందించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ RRR షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజా వార్తల ప్రకారం రామ్ చరణ్ ను సుజీత్ సంప్రదించినట్టు, రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంతా సక్రమంగా జరిగితే మరో స్టైలిష్ మూవీ ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. హీరో రామ్ చరణ్, సుజీత్ కాంబినేషన్ మూవీ ని ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: