బ్లాక్ బస్టర్ తమిళ మూవీ “బిగిల్”లో ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ గా నటించి గుర్తింపు పొందిన అమృత అయ్యర్ టాలీవుడ్ కు కథానాయిక గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వంలో రూపొందిన “30 రోజులలో ప్రేమించడం ఎలా ?”రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మూవీ తో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కధానాయకుడు, అమృత అయ్యర్ కథానాయికగా టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇప్పుడు అమృత అయ్యర్ మరో బిగ్ మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న “RED” మూవీ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. “RED” మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ కథానాయికలు కాగా మరో కథానాయిక గా అమృత అయ్యర్ ఎంపిక అయ్యారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండవ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా సెలెక్ట్ కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























