బిజీ కమెడియన్ గా ఎదుగుతున్న పంచ్ సీన్ల పమ్మి సాయి

Comedian Pammi Sai New Movie News, Latest Telugu Movies News, Pammi Sai Evolves As Busy Comedian In TFI, Pammi Sai Evolves As Busy Comedian In Tollywood, Pammi Sai Latest News, Pammi Sai Upcoming Film News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

నటుడు కావాలి అని అతను కలలు కనలేదు… ప్రయత్నాలు చేయలేదు.. సినిమా ఆఫీసుల చుట్టూ తిరగలేదు.. కానీ ఈ రోజున టాలీవుడ్ లో అతను ఒక నోటెడ్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ఎలక్ట్రానిక్స్ లో డిప్లమో చేసి రిల్ పూల్ కంపెనీలో జాబ్ చేస్తున్న అతను నటుడిగా మారటం… మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా పాపులారిటీ సంపాదించడం యాదృచ్చికంగా జరిగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది తలకిందులుగా తపస్సు చేస్తుంటే శ్రీనివాస్ సాయిరామ్(పమ్మి సాయి)కి మాత్రం ఒక ప్రముఖ దర్శకుడి పరిచయ రూపంలో అవకాశం వచ్చింది. సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వస్థలం భీమవరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే ఊరికి చెందిన పమ్మి సాయికి చిన్నప్పటినుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని సరదాగా ‘ అతడు ‘ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలా సరదాగా ప్రారంభమైన పమ్మి సాయి యాక్టింగ్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది.

[custom_ad]

తొలి అవకాశం ఇచ్చి వదిలేయకుండా వరుసగా తన సినిమాలన్నింటిలో మంచి వేషాలు ఇస్తూ పమ్మి సాయిని ప్రోత్సహిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒక్క ‘నువ్వే నువ్వే’ చిత్రంలో తప్ప త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లో నటించాడు పమ్మీ సాయి.

ప్రముఖ దర్శక రచయిత వంశీ రచించిన పసలపూడి కథలు లోని 97వ కథ అయిన ‘దొంగ శీను’ పాత్రలో నా నటన చూసి కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ప్రశంసించడం నా జీవితంలో ఒక మరపురాని అనుభూతి అంటాడు పమ్మి సాయి.

[custom_ad]

త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి ప్రముఖ దర్శకుడు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న పమ్మి సాయికి ఇతర దర్శకుల నుండి కూడా అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. ఛలో, చల్ మోహనరంగా, ఎవరు, శతమానం భవతి , ఎం.ఎల్.ఏ. వంటి దాదాపు 60 చిత్రాలలో ప్రాముఖ్యత గల హాస్య పాత్రలు పోషించిన పమ్మి సాయికి ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధిస్తున్న ‘ అల వైకుంఠపురంలో ‘ మంచి పేరు తెచ్చింది. పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ లో ఒకే ఒక్క సీన్ లో కనిపించిన సాయి నవ్వులు పూయించాడు.

[custom_ad]

థియేటర్లో సాయిని చూడగానే ఇతని నుండి ఏదో ఒక పంచ్ పేలుద్ది అనే ఎక్స్పెక్టేషన్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే చిన్న వేషమే అయినా రెండు మూడు బ్లాస్టింగ్ పంచెస్ తో కడుపుబ్బ నవ్విస్తాడు పమ్మి సాయి. “నేను సినిమాల్లోకి రావటం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ప్రోత్సాహం వల్లనే అయినప్పటికీ ఇప్పుడు మంచి అవకాశాలు రావడంతో యాక్టింగ్ ను సీరియస్ ప్రొఫెషన్ గా తీసుకున్నాను. ప్రస్తుతం చిరంజీవి గారు – కొరటాల శివ గారి కాంబినేషన్ చిత్రంలో, శివ నిర్వాణ గారి దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియో వారి చిత్రంలో, రెడ్ చిత్రంలో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను” – అంటున్న పమ్మి సాయి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్స్ గా ఎదుగుతాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు.

[custom_ad]

తనకు మొదటి నుండి నటుడు కావాలి అనే ఆరాటం లేకపోయినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయ రూపంలో ఎదురు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అగ్ర దర్శకులందరి దృష్టిని ఆకర్షిస్తున్న పమ్మి సాయి త్వరలోనే అగ్రశ్రేణి హాస్యనటుడిగా ఎదుగుతాడని ఆశిస్తూ “ ఆల్ ద బెస్ట్” చెబుతోంది ‘ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం ‘.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =