తమిళ్ స్టార్ హీరో విజయ్ మంచి ఫామ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 64 వ సినిమా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్టర్ అనే టైటిల్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే ఇప్పుడు 65వ సినిమాను కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో ‘కాడైకుట్టి సింగం’.. ‘నమ్మ వీట్టు పిళ్లై’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ‘పాండిరాజ్’ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని సమాచారం. ఇటీవల ‘పాండిరాజ్’ విజయ్ ను కలిసి ఒక కథను వినిపించాడట. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: