ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ’96’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తెలుగులో శర్వానంద్, సమంత జంటగా ఈ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు ‘ప్రాణం’ అనే సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
[custom_ad]
కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: