కామెడీ థ్రిల్లర్ లో శివాత్మిక..!

Shivathmika Signs An Interesting Project?

‘దొరసాని’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరును తెచ్చుకుంది. ప్రస్తుతం శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది శివాత్మిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో కొత్త సినిమాను లైన్లో పెట్టింది శివాత్మిక. దుర్గా నరేష్ గుట్టా దర్శకత్వంలో యంగ్ హీరో అరుణ్ అదిత్ కి జంటగా ఓ కామెడీ థ్రిల్లర్ లో నటించనుంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో పలువురు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

[custom_ad]

కాగా ఇంకా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా… కోట శ్రీనివాసరావు, పోసాని, సత్య, అజయ్ ఘోష్, అజయ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఎస్ కె ఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో శివ దినేష్ రాహుల్, అయ్యర్ నకరకాంతి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =