`సవ్యసాచి`(2018)తో తెలుగునాట కథానాయికగా తొలి అడుగు వేసిన నిధి అగర్వాల్.. మలిచిత్రం `మిస్టర్ మజ్ను`(2019)తోనూ ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అయితే, గత ఏడాది జూలైలో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్`… నిధి కెరీర్ ని అనూహ్యంగా మలుపు తిప్పింది. ఈ సినిమా అందించిన విజయంతో మరిన్ని అవకాశాలను మూటగట్టుకుందీ టాలెంటెడ్ బ్యూటీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఈ నేపథ్యంలోనే… ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. కాగా, నిధి అగర్వాల్ తొలి తమిళ చిత్రం `భూమి` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. `జయం` రవి హీరోగా నటిస్తున్న ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో… నిధి పల్లెటూరి యువతిగా దర్శనమివ్వనుంది. లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే1న జనం ముందుకు రానుంది. మరి.. తొలి తమిళ చిత్రంతో నిధి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























