సినిమా బావుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిజమైంది ‘మత్తు వదలరా’ సినిమా విషయంలో. ఎలాంటి సినిమాలకు మౌత్ టాక్ ఉంటే చాలు. సినిమా హిట్ ఐపోయినట్టే. ప్రస్తుతం ‘మత్తు వదలరా’ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.ఫస్ట్ షో నుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను అందించారని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఎక్స్ట్రా షోలు యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాళభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘మత్తు వదలరా’. ఈ సినిమా ద్వారా రితేష్ రానా అనే దర్శకుడు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిన్న సినిమాను చిరంజీవి (చెర్రీ) నిర్మించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: