అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ తన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇంక మిగిలిన పాత్రల డబ్బింగ్ కూడా త్వరలోనే పూర్తిచేయనున్నారు.
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























