‘96’కు 11 అవార్డులు

Cloud 9 Moment For Actress Trisha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Trisha Latest News,Trisha Upcoming Movie News,Trisha Next Film Updates,Trisha Latest Movie Details

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ’96’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని ఫిబ్ర‌వరి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు త్రిషకు 11 అవార్డులను తెచ్చిపెట్టింది. ఇప్పుడు తాజాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదిక పంచుకుంది. జాను పాత్రకు ఇప్పటివరకు 11 అవార్డులు వచ్చాయంటూ అవార్డులతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నాకు వచ్చిన దీవెనలను లెక్కిస్తున్నా.. ‘96’కు 11 అవార్డులు, ‘హేజూడ్’(మలయాళం) సినిమాకు 3 అవార్డులు.. మీ ప్రేమకు కృతజ్ఞతలు అని త్రిష ట్వీట్ చేసింది.

మరి తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష ఈ సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.. వారికి ఎన్ని అవార్డులు తెచ్చిపెడుతుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 6 =