విజయశాంతి అర్థవంతమైన ఫేస్ బుక్ పోస్ట్

Vijayashanti Shares Her Happiness Being Apart Of Sarileru Neekevvaru Movie On Facebook

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన “సరిలేరు నీకెవ్వరు “మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ లో ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. “సరిలేరు నీకెవ్వరు ” మూవీ లో ప్రొఫెసర్ భారతి గా ఒక కీలక పాత్రలో విజయశాంతి నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైనికుల గొప్పతనాన్ని,త్యాగనిరతిని కష్టాలను తెలిపే “సరిలేరు నీకెవ్వరు” టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ 23వ తేదీ రిలీజ్ చేయగా అద్భుత స్పందన లభించింది. ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రచించి, లైవ్ రికార్డింగ్ చేయడం విశేషం. “సరిలేరు నీకెవ్వరు” టైటిల్ సాంగ్ పై విజయశాంతి స్పందించారు. మహాత్మ గాంధీ , తిలక్, గోఖలే, ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్ సింగ్, ఆజాద్ , అంబేద్కర్ వంటి వారితోపాటు ఎందరో స్వాతంత్య్ర వీరుల పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం. భారతీయ సైన్యానికి నివాళి గా ఈసొంగ్ రూపొందింది ..జై భారత్ .. మీ ప్రొఫెసర్ భారతి అంటూ విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.