డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజు ద్వారా సినిమా విడుదలైందంటే మినిమం గ్యారంటీ రిలీజ్ ఉంటుందన్న పేరు సంపాదించుకున్నాడు. ఇక కొత్త కొత్త డైరెక్టర్స్ ను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేయడం.. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు దిల్ రాజు. అందుకే దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తన సినీ కెరీర్ లో ఎంతో మంది వారసులను తెలుగు తెరకు పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు తమ ఇంటి వారసుడిని పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు తన సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా ఇంట్రడ్యూజ్ చేస్తూ ఇదివరకే సినిమాను లాంచ్ చేశారు.
ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు పూర్తికావడంతో టైటిల్ ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. చిత్రం యూత్ ఫుల్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది కాబట్టి ‘రౌడీ బాయ్స్’ అనే క్రేజీ టైటిల్ పెట్టనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కాగా ఈ చిత్రాన్ని ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష డైరెక్ట్ చేయనున్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: