కన్నడ హీరో రక్షిత్ శెట్టి అందాల రష్మిక మందన బ్రేకప్ గురించి తెలిసిందే. ‘కిరిక్ పార్టీ’ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించడం… ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. అది ఎంగేజ్మెంట్ వరకు వెళ్లడం…రెండేళ్ల పాటు సవ్యంగానే సాగిన వీరి ప్రేమకి కొన్ని నెలల క్రితం బ్రేకుల పడటం.. ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే వారి బ్రేకప్ పై పలు ఇంటర్వ్యూల్లో వారికి మాత్రం ప్రశ్నలు కామనే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరోసారి రక్షిత్ కు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. రక్షిత్ శెట్టి సచిన్ దర్శకత్వంలో అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వనున్నాడు రక్షిత్ శెట్టి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నరక్షిత్ ను రష్మిక తో బ్రేకప్ గురించి అడుగగా.. ‘రష్మికకు చాల పెద్ద కలలు ఉన్నాయని, కెరీర్ పై దృష్టి పెట్టే క్రమంలో మేం విడిపోవాలనుకున్నామని.. కానీ, ఆమె కలలు నిజం కావాలని దేవున్ని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
కాగా ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. కన్నడలో డిసెంబర్ 27న, తెలుగులో జనవరి 1న, తమిళ్, మాలయాళంలో జనవరి 3న, హిందీలో జనవరి 16న ఈ సినిమా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























