`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నుంచి రానున్న చిత్రం `రెడ్`. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. `నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగీ` చిత్రాల తరువాత రామ్, కిషోర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాని… ఆ రెండు చిత్రాలను నిర్మించిన స్రవంతి మూవీస్ సంస్థనే నిర్మిస్తుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ లోని అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ రామ్ బృందంపై కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
కాగా, తమిళ చిత్రం `తడమ్` ఆధారంగా రూపొందుతున్న `రెడ్`కి మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























