అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్ లో భాగంగా ప్రతి సోమవారం ఒక పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























