ట్యాగ్ · 1 కథనాలు
సాంగ్
'సరిలేరు నీకెవ్వరు' - టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్ లో భాగంగా ప్రతి సోమవారం ఒక పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు.