యువ కథానాయకుడు నిఖిల్, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందిన డివోషనల్ థ్రిల్లర్ `కార్తికేయ`(2014)… అప్పట్లో మంచి విజయం సాధించింది. కట్ చేస్తే… ఐదేళ్ళ తరువాత ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. కుంభమేళా నేపథ్యంలో…. `కార్తికేయ` సీక్వెల్ తెరకెక్కుతోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో కథానాయికగా `ప్రేమమ్` బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించనుందని తెలిసింది. ఇదివరకు శ్రుతి శర్మ, నభా నటేష్ పేర్లు వినిపించినా ఆ అవకాశం అనుపమకి దక్కిందని వినికిడి. త్వరలోనే అనుపమ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. నిఖిల్ తో అనుపమకి ఇది తొలి చిత్రమే అయినా… చందు మొండేటి కాంబినేషన్ లో మాత్రం అనుపమకి ఇది రెండో సినిమా. ఇదివరకు `ప్రేమమ్` కోసం అనుపమ, చందు కలసి పనిచేశారు.
మరి… అచ్చొచ్చిన కథానాయకుడు, కథానాయికతో చందు మొండేటి చేస్తున్న ఈ ప్రయత్నం ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























