మంత్రి ధర్మాన నోట రాజమౌళి – బోయపాటి ప్రస్తావన

Minister Dharmana Prasada Rao Offends Film Celebrities For No Reason,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dharmana Prasada Rao News and Updates,Dharmana Prasada Rao About Rajamouli,Dharmana Prasada Rao Sensational Comments On Boyapati Srinu

పెళ్లోళ్లు పెళ్లోళ్లు బాగానే ఉన్నారు.. కానీ పెళ్లికి వచ్చిన వాళ్లే ఏదో ” .. అన్నట్లుగా ఉంది నిన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని పై జరిగిన ప్రత్యక్ష ప్రసార చర్చా కార్యక్రమం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాద రావు తన ప్రసంగంలో రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించే క్రమంలో “సినిమా వాళ్ళు.. సినిమా వాళ్ళు” – అంటూ అవహేళనగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు సుప్రసిద్ధ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సహకారాన్ని తీసుకోవటాన్ని ఎద్దేవ చేస్తూ మాట్లాడారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

అలాగే తెలుగుదేశం ఎన్నికల ప్రచార చిత్రాలను రూపొందించడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ అధికార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గురించి మాట్లాడుతూ “ బోయపాటి శీను… ఈయనొకడు” అని అవహేళనగా మాట్లాడటం జరిగింది. నిజానికి ఈ వ్యవహారం చూస్తే రాజకీయాలతో ఎలాంటి ప్రమేయం లేక పోయినప్పటికీ సినిమా వాళ్లను తేలికగా, చులకనగా, అవహేళనగా మాట్లాడటం కొందరు రాజకీయ నాయకులకు పరిపాటి అయిపోయింది. చంద్రబాబు నాయుడు రాజమౌళిని, బోయపాటి శీను ను వాళ్ల అవసరం నిమిత్తం ఎంగేజ్ చేసుకున్నారే తప్ప వాళ్ళకై వాళ్ళు ఎగబడి వెళ్ళలేదు. అయితే అయినదానికీ కానిదానికీ సినిమావాళ్ల మీద ఎక్కిపోయే దురుసుతనం అధికార ప్రతిపక్షాలతో పాటు అన్ని పార్టీల వాళ్ళలో ఉంది.

గతంలో ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీకే చెందిన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ సినిమావాళ్ల మీద అర్థం పర్థం లేకుండా నోరు పారేసుకున్నారు. ఇంకా చాలా సందర్భాలలో సినిమా వాళ్లను చులకన చేసి మాట్లాడి నోటి దూల తీర్చుకున్నారు చాలామంది రాజకీయ ప్రముఖులు. ఈ ధోరణి ఏ మాత్రం సమర్ధనీయం కాదు. నిజానికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న సినిమా వాళ్ళు, రాజకీయ తీర్థం పుచ్చుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అయితే ప్రచారాలకు, పబ్లిసిటీకి వాడుకునేటప్పుడు సినిమా వాళ్ళను ఆకాశానికి ఎత్తేసి అవసరం తీరాక “సినిమా వాళ్ళు- సినిమా వాళ్ళు” అంటూ అవహేళనా స్వరంతో మాట్లాడటంలో రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయి.

సినిమా అనేది సమాజంలో ఒక ఆకర్షణీయమైన వ్యవస్థ. రాజకీయ రంగం ఒక బలమైన వ్యవస్థ. ప్రజాబాహుళ్యంతో ముడిపడిన రెండు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవ అభిమానాలు ఉండాలి గానీ సందర్భం ఉన్నా లేకపోయినా ఇలా ఎద్దేవ చేయటాలు, ఎత్తి పొడుచుకోవటాలు
ఉండకూడదు. ముఖ్యంగా పేర్లు ప్రస్తావిస్తూ వ్యక్తులను చులకన చేయటం మంచి పద్ధతి కాదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.