మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. సైంటిఫిక్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో… తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారు రవితేజ. ఇక ఆయనకి జోడీగా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ వంటి గ్లామరస్ హీరోయిన్స్ కనువిందు చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో తాన్యా హోప్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సంగతి తెలిసింది. అదేమిటంటే… ఇందులో తను సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తుందట. కథానాయకుడికి సహాయపడే పాత్ర ఇదని… నటనకు అవకాశమున్న ఈ క్యారెక్టర్ లో తాన్య గుర్తుండిపోయే పెర్ ఫార్మెన్స్ ఇచ్చిందని టాక్.
మరి…. ఇప్పటికే `అప్పట్లో ఒకడుండేవాడు`, `పటేల్ సర్`, `పేపర్ బోయ్` చిత్రాల్లో నటించిన తాన్యా హోప్ కి `డిస్కోరాజా` అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న `డిస్కో రాజా` జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: