స్పెషల్ డే రోజు రానున్న రూలర్ ట్రైలర్..!

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా… కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =