నిర్మాతగా మారనున్న సామ్..!

Samantha Akkineni Turns Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samantha Latest News,Samantha Upcoming Movie News,Samantha Turns Producer,Akkineni Samantha Turns Producer

ఏదిఏమైనా సమంతకు లక్ కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. వివాహ జీవితంతో పాటు సినీ కెరీర్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా చాలా బాగా నడుస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా వరుసఆఫర్లు.. వరుస హిట్లు అందుకున్న హీరోయిన్ ఎవరైనా వున్నారంటే అది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్ళైన తర్వాత చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ.. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు హీరోయిన్ గా రాణించిన సామ్ ఇప్పుడు నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. గతంలోనే తన స్నేహితుడు రాహుల్ తీసిన చి.ల.సౌ సినిమాని చూసి బాగుండడంతో ఆ కథను అక్కినేని బ్యానర్ నుండి విడుదల చేయించింది. ఆ సినిమా మంచి హిట్ అయింది.

ప్రస్తుతం కథలను వింటున్న సామ్ మంచి కథలు ఎంపిక చేసుకొని పెద్ద ఎత్తున నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తుందట. అంతేకాదు ఏదైన కథ నచ్చితే తానే నటిస్తూ.. నిర్మించడానికి కూడా రెడీ అయ్యిందట సామ్.

అంతేకాదు లూసియా చిత్రంతో సూపర్ హిట్ సాదించిన పవన్ కుమార్ స్వీయ కుమార్ దర్శక నిర్మాణం లో మరో మిస్టరీ చిత్రం తెరకెక్కబోతుంది..ఈ చిత్రాన్ని తెలుగు , తమిళం లో రీమేక్ చేయనున్నారు.. అయితే ఈ చిత్ర నిర్మాణం లో సమంత జాయిన్ అవుతుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సిందే..

మరి హీరోయిన్ గా సక్సెస్ అయిన సమంత నిర్మాణ రంగం లో కూడా తన హావ కొనసాగించాలని చూస్తుంది…చూద్దాం మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 10 =