న‌వంబ‌ర్ 21, 22, 23… టీజ‌ర్స్ స్పెష‌ల్

Special Month For New Movie Teaser Releases,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Special Month For New Telugu Movie Teaser,Telugu Movie Teasers in November 2019,Telugu Movie Teasers 2019

ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల టీజ‌ర్స్ వ‌రుస‌గా మూడు రోజుల పాటు సంద‌డి చేయ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. న‌వంబ‌ర్ 21, 22, 23 తేదీల్లో ఇలాంటి వాతావ‌ర‌ణమే నెల‌కొంటోంది. ఈ మూడు రోజులు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ టీజ‌ర్స్ హ‌వా ఉండ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న‌వంబ‌ర్ 21 అంటే ఈ రోజు సాయంత్రం న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త చిత్రం `రూల‌ర్‌`కి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఇక న‌వంబ‌ర్ 22న అంటే రేపు (శుక్ర‌వారం) సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అప్ క‌మింగ్ ఫిల్మ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` టీజ‌ర్ రాబోతోంది. చిత్ర‌ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి పుట్టిన‌రోజు(న‌వంబ‌ర్ 23)కి ఒక‌రోజు ముందు ఈ టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తుండ‌డం విశేషం. ఇక న‌వంబ‌ర్ 23న విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్ `వెంకీమామ‌` తాలూకు టీజ‌ర్ రిలీజ్ కానుంది. చైతూ బ‌ర్త్ డే (న‌వంబ‌ర్ 23) స్పెష‌ల్‌గా ఈ టీజ‌ర్‌ని విడుదల చేయ‌డానికి ప్లానింగ్ జ‌రుగుతోంది. మొత్త‌మ్మీద‌… వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తాలూకు ప్ర‌చార చిత్రాలు విడుద‌ల కావ‌డం టాలీవుడ్ లో వార్త‌ల్లో నిలుస్తోంది.

అన్న‌ట్టు… రేపు (న‌వంబ‌ర్ 22) మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ `అల వైకుంఠ‌పుర‌ములో` నుంచి `OMGdaddy` ఫుల్ సాంగ్ విడుద‌ల కాబోతుండ‌డం విశేషం. మ‌రి… ఈ టీజ‌ర్స్, సాంగ్ ట్రీట్ ఆ యా క‌థానాయ‌కుల అభిమానుల‌ను ఏ స్థాయిలో అల‌రిస్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =