ట్యాగ్ · 2 కథనాలు
బాలకృష్ణ - బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభం
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ తో షూటింగును మొదలెట్టారు. తొలి షెడ్యూల్లోనే యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. గ్రహాలు .. ప్రభావం ఒక కోణంగా, అఘోర పాత్ర మరో కోణంగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.
బాలకృష్ణ, బోయపాటి చిత్రానికి ముహూర్తం ఫిక్స్?
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ చిత్రం `రూలర్`ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 20న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ లోపే బాలయ్య తన నెక్ట్స్ వెంచర్ ని ప్రారంభించబోతున్నారని టాక్. తనకు అచ్చొచ్చిన దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేయబోతున్న ఈ సినిమాని డిసెంబర్ 9న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టే అవకాశముందని వినికిడి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలయ్య రెండు విభిన్న ఛాయలున్న…