విభిన్న కథాంశాల చిత్ర నటుడు, దర్శకుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కు దక్షిణాదిన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఉపేంద్ర తాను నటించే కొత్త మూవీ ని ప్రకటించారు. నిర్మాత, దర్శకుడు ఆర్ .చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో కబ్జ మూవీ రూపొందనుంది. కబ్జ మూవీ లో 7గురు విలన్స్ ను ఎంపిక చేశారు. నానా పటేకర్, మనోజ్ బాజ్ పాయ్ , ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, సముద్ర ఖని ప్రతి నాయక పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కబ్జ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 వ తేదీ ప్రారంభం కానుంది. ఈ మూవీ లో గ్యాంగ్ స్టర్ పాత్రలకు 10 వేలమంది హాజరవగా 500 మందిని ఎంపిక చేసినట్టు సమాచారం. అండర్ వరల్డ్ నేపథ్యం లో రూపొందనున్న మాస్ ఎంటర్ టైనర్ కబ్జ మూవీ 7 భాషలలో రిలీజ్ కానుంది. నిర్మాత, దర్శకుడు ఆర్ .చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా రూపొందిన ఐ లవ్ యు మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ తో రూపొందుతున్న కబ్జ మూవీ పై ప్రేక్షకులలో క్రేజ్ నెలకొంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: