‘రాజు గారి గది3’ రివ్యూ

Latest telugu movie reviews, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Raju Gari Gadhi 3 Movie Plus Points, Raju Gari Gadhi 3 Movie Public Talk, Raju Gari Gadhi 3 Movie Rating, Raju Gari Gadhi 3 Movie Review, Raju Gari Gadhi 3 Movie Story, Raju Gari Gadhi 3 Review, Raju Gari Gadhi 3 Telugu Movie Live Updates, Raju Gari Gadhi 3 Telugu Movie Public Response, Raju Gari Gadhi 3 Telugu Movie Review, Raju Gari Gadhi 3 Telugu Movie Review And Rating

ఓంకార్ దర్శకత్వంలో ‘రాజు గారి గది’ సీక్వెల్ లో భాగంగా ‘రాజు గారి గది3’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘రాజు గారి గది’ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయిందో..? లేదో..? తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు – అశ్విన్‌ బాబు, అవికా గోర్‌, అలీ, అజయ్‌ ఘోష్‌, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్‌ శ్రీను, శివశంకర్‌ మాస్టార్‌, హరితేజ
దర్శకత్వం – ఓంకార్‌
నిర్మాణం – ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌
సంగీతం – ష‌బీర్‌

కథ:

హీరో అశ్విన్ బాబు ఒక ఆటో డ్రైవర్. తను కాలనీలో ఉండేవాళ్లకు ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఇక హీరోయిన్ మాయ (అవికా గోర్) డాక్టర్ గా పనిచేస్తుంది. ఇదిలా ఉండగా మాయ తండ్రి గరడపిళ్లై కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయకు ఎప్పుడూ ఒక దెయ్యం కాపలా ఉండేలా పెడతాడు. దాని పని ఏంటంటే.. మాయను ఎవరైనా ఇబ్బంది పెట్టినా.. వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. ఓ దెయ్యం వారికి చుక్కలు చూపిస్తుంది. ఈ సందర్భంగా ఒక ఘటనలో అశ్విన్ బాబు, హీరోయిన్ మాయతో కలుస్తాడు. ఆ తర్వాతఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఇక మాయను ఎప్పుడూ నీడలా వెంటాడే ఆ దెయ్యం అశ్విన్ బాబును ఏం చేసింది..? ఆ దెయ్యం బారి నుండి ఎలా తప్పించుకుంటాడు..? ఆఖరికి మాయ ప్రేమను గెలుస్తాడా..? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

బుల్లి తెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్‌ కామెడీ జానర్‌లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీనిలో భాగంగానే ‘రాజు గారి గది2’ ఇప్పుడు ‘రాజు గారి గది3’ సినిమా తెరకెక్కించాడు. ఇక ఈ సరి కూడా హార్రర్ కామెడీనే నమ్ముకున్నాడు ఓంకార్. అంతేకాదు హార్రర్ కామెడీతో నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ హార్రర్ కామెడీకి కాస్త డిఫరెంట్ పాయింట్ నే ఎంచుకున్నాడు. ఒక రాజు గారు తన కూతురు‌ను వేధిస్తున్న ఒక బ్రిటిష్ అధికారిని మట్టుపెట్టుడానికి ఒక యక్షణి దెయ్యాన్ని ప్రయోగిస్తాడు. ఆ తర్వాత దాన్ని ఒక మహల్‌ (రాజు గారి గది)లో బంధిస్తాడు ఆ రాజు. ఆ దెయ్యానికి ప్రస్తుత కాలానికి లింకు పెట్టి ఈ కథను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక అశ్విన్ బాబు కూడా తన పరిధిలో బాగానే నటించాడు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో ఎలాగైతే మంచి గుర్తింపు తెచుకున్నాడో ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఓంకార్ అశ్విన్ ను మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేసాడు. దానికి తగినట్టుగానే అశ్విన్ కూడా మునుపటికంటే ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత అవికా గోర్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. క్లైమాక్స్ సీన్ లో దెయ్యంగా బాగా నటించి తనలో ఉన్న మరో యాంగిల్ ను చూపించింది. మరోవైపు ఆలీ, బ్రహ్మాజీ కామెడీ బాగుంది. ముఖ్యంగా బ్రహ్మాజీ నే ఈ సినిమా టర్నింగ్ పాయింట్. హీరోయిన్ వెనుక పడే సన్నివేశాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. సెకండాఫ్‌లో అజయ్ ఘోష్, ఊర్వశిల నటన ఈ సినిమాకు హైలైట్. అజయ్‌ ఘోష్‌, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు.

చోటా కే.నాయుడు కెమెరా పనితనం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. అనవసర సీన్స్ లేకుండా బాగా ఎడిటింగ్ చేశారు. షబీర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. బుర్రా సాయి మాధవన్ కామెడీ డైలాగ్స్ సినిమాకు బాగా కలిసొచ్చాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ‘రాజు గారి గది3’ ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =