మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అనగానే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కళ్ళముందు కదలాడతాయి. అటువంటి బ్లాక్బస్టర్ మూవీస్లో ‘రౌడీ అల్లుడు’ ఒకటి. కళ్యాణ్, ఆటో జానీగా చిరు ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్లో శోభన, దివ్యభారతి కథానాయికలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, జె.వి.సోమయాజులు, కెప్టెన్ రాజు, బ్రహ్మానందం, “ఐరన్ లెగ్” శాస్త్రి తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా… `డిస్కో` శాంతి ప్రత్యేక గీతంలో దర్శనమిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీతరచనలో… బప్పీలహరి వీనుల విందైన బాణీలు అందించారు. “లవ్ మీ మై హీరో”, “చిలుకా క్షేమమా”, “అమలాపురం బుల్లోడా”, “ప్రేమా గీమా తస్సాదియ్యా”, “తద్దినక తప్పదిక”, “కోరి కోరి కాలుతోంది”… ఇలా ఇందులోని అన్ని పాటలూ విశేషాదరణ పొందాయి. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీసాయిరాం ఆర్ట్స్ పతాకంపై డా.కె.వెంకటేశ్వరరావు, ‘పంజా’ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1991 అక్టోబర్ 18న విడుదలై ఘన విజయం సాధించిన ‘రౌడీ అల్లుడు’… నేటితో 28 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: