టెర్ర‌రిస్ట్ పాత్ర‌లో స‌మంత‌?

Samantha to Play Terrorist Role in the Family Man Second Season,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samantha New Movie Updates,Samantha Next Film News,Samantha Latest Movie News,Samantha Next Film News

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న‌ క‌థానాయిక స‌మంత‌. పెళ్ళ‌య్యాక కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌కే ఓటేస్తూ ముందుకు సాగుతున్న సామ్‌… తాజాగా మ‌రో డిఫ‌రెంట్ రోల్‌లో న‌టించింద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… తెలుగు ద‌ర్శ‌కులు డీకే, రాజ్ సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’. అమెజాన్ ప్రైమ్‌లో ప‌లు భాష‌ల్లో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ వెబ్ సిరీస్ తొలి సీజ‌న్ అన్నిచోట్ల ప్ర‌జాద‌ర‌ణ పొందింది. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన… రెండో సీజ‌న్ త్వ‌ర‌లో ప్ర‌సారం కానుంది. ఇప్ప‌టికే సెకండ్ సీజ‌న్‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింద‌ని, ఇందులో స‌మంత కూడా న‌టిస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు… ఇందులో సామ్ నెగటివ్ టచ్ ఉన్న టెర్రరిస్ట్‌గా నటించింద‌ని స‌మాచారం.

మరి… తొలి వెబ్ సిరీస్ కోసం వైవిధ్యమైన పాత్రను ఎంచుకున్న సామ్… అందులోనూ తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.