విజ‌య‌శాంతి ‘ప్రతిఘటన’కు 34 ఏళ్ళు

Vijaya Shanthi Prathighatana Movie Completes 34 Years,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,34 Years For Vijaya Shanthi Prathighatana, 34 Years For Vijaya Shanthi Movie Prathighatana, 34 Years of Prathighatana Movie, Prathighatana Movie Completes 34 Years, Prathighatana Teulgu Movie

తెలుగునాట ఫిమేల్ సెంట్రిక్ మూవీస్‌కు చిరునామాగా నిలిచిన‌ కథానాయికలలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకరు. ఆమె నటించిన పలు నాయికా ప్రాధాన్యత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ ఒక‌టి. విప్ల‌వ‌చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న టి.కృష్ణ ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కించారు. ఇందులో చంద్రమోహన్, రాజశేఖర్, చరణ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, వై.విజయ, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి వేటూరి సుందరరామమూర్తి గీత రచ‌న చేయ‌గా… చక్రవర్తి ఆక‌ట్టుకునే బాణీలు అందించారు. ముఖ్యంగా “ఈ దుర్యోధన దుశ్శాసన” పాట అయితే… ఇప్పుడు విన్నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా… `ఉత్తమ నటి`(విజయశాంతి), `ఉత్తమ గాయని`(ఎస్.జానకి – “ఈ దుర్యోధన” పాటకు) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకోవ‌డ‌మే కాకుండా… ఉత్తమ నటి(విజయశాంతి), ఉత్తమ చిత్రం(రామోజీరావు) విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారాల‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని మలయాళంలో ‘పకరతిను పకరం’ పేరుతోనూ, హిందీలో ‘ప్రతిఘాట్’ టైటిల్‌తోనూ పునర్నిర్మించడం విశేషం. 1985 అక్టోబర్ 11న విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘ప్రతిఘటన’… నేటితో 34 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here