పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయమైనా… అనతికాలంలోనే నటుడిగా తనదైన ముద్రవేశారు పవన్. అలాంటి పవన్ నటనాప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. బాలీవుడ్ మూవీ ‘కయామత్ సే కయామత్ తక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంతోనే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, `కింగ్` నాగార్జున మేనకోడలు సుప్రియ నాయికగా పరిచయమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాజర్, చంద్రమోహన్, శరత్‌బాబు, ‘ఆహుతి’ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, కవిత, సుధ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించగా… రంభ స్పెషల్ సాంగ్‌లోనూ, ఊహ అతిథి పాత్రలోనూ మెరిసారు.
వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన గీతాలకు… కోటి వీనులవిందైన బాణీలు అందించారు. ముఖ్యంగా “ప్రియ సఖి ఓమ్”, “చలిగాలి ఝుమ్మంది”, “ప్రేమన్న చిన్న మాటలోనే” వంటి పాటలు విశేషాదరణ పొందాయి. 1996 అక్టోబర్ 11న విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’… నేటితో 23 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది. అంటే పవన్ నటనాప్రస్థానానికి నేటితో 23 వసంతాలు పూర్తవుతున్నాయన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: