‘ఆర్ ఆర్ ఆర్`… ఫ‌స్ట్ మీటింగ్‌ సీన్ అప్‌డేట్‌

Komaram Bheem and Alluri Sitaramaraju First Meeting Scene in RRR,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,New schedule of RRR begins,RRR New schedule Updates,SS Rajamouli RRR Movie Latest News

అల్లూరి సీతారామరాజు (1897 – 1924), కొమరం భీమ్(1901 – 1940)… అటుఇటుగా ఒకే కాలానికి చెందిన‌ వేర్వేరు ప్రాంతాల తెలుగు పోరాట యోధులు. చ‌రిత్ర‌లో ఈ ఇద్ద‌రూ క‌లిసిన‌ట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి ఈ ఇరువురు ఒకనొక సంద‌ర్భంలో తార‌స‌ప‌డడ‌మే కాకుండా… ఒక‌రి పోరాటానికి మ‌రొక‌రు స్ఫూర్తిగా నిలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. వాస్త‌వ‌ పాత్రలు, క‌ల్పిత ఘ‌ట్టాల‌తో రూపొందుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్‌, అల్లూరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శనమివ్వనుండ‌గా… ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి దృశ్య‌రూప‌మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్‌`లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే .. అది అల్లూరి, కొమ‌రం ఫ‌స్ట్ మీటింగ్ సీన్ అనే చెప్పాలి. దీన్ని జ‌క్క‌న్న వీరోచితంగా డిజైన్ చేశార‌ని టాక్‌.

ఆప‌ద‌లో చిక్కుకున్న ఓ చిన్న పాపని కొమ‌రం భీమ్ పాత్ర‌ధారి తార‌క్ ర‌క్షించ‌డం… అది చూసి అల్లూరి పాత్ర‌ధారి చ‌ర‌ణ్ ఇంప్రెస్ అవ‌డం… ఆపై ఒక‌రి స్ఫూర్తితో మ‌రొక‌రు పోరుబాట‌లో ప‌య‌నించ‌డం… ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన‌ దృశ్యాల‌తో `ఆర్ ఆర్ ఆర్‌` క‌థానాయ‌కుల ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్ ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే, ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే మాత్రం… విడుద‌ల తేది అయిన 2020 జూలై 30 వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చ‌ర‌ణ్‌కు జోడీగా అలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా… బాలీవుడ్ నటుడు అజ‌య్ దేవ‌గ‌ణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =