అర్జున్ రెడ్డి పై క్రష్ లిస్ట్ లో మరో స్టార్ హీరోయిన్

Latest Telugu Movies News, Rakul Preet Singh Has A Crush On This Telugu Hero, Rakul Preet Singh Latest News, Rakul Preet Singh Loves Vijay Deverakonda, Rakul Preet Singh Next Film Updates, Rakul Preet Singh Next Project Details, Rakul Preet Singh Reveals Her Crush on Rowdy Vijay Deverakonda, Rakul Preet Singh Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ. ఆ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు సౌత్ మొత్తం ఇంకా నార్త్ లో కూడా ఒక్కసారిగా టాక్ అఫ్ ద టౌన్ అయి మంచి క్రేజ్ ను సైతం దక్కించుకున్నాడు. అంతే కాదు పలువురు హీరోయిన్లకు కూడా హాట్ ఫెవరెట్ అయ్యాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అర్జునరెడ్డి పై ఉన్న క్రష్ ను ఓపెన్ గానే చెప్పేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి సైతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనివుంది కరణ్ ఇంటర్వ్యూలో చెప్పింది ఇంకా అర్జున్ రెడ్డి రీమేక్ చేసి కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కియారా అద్వాని కూడా గతంలో తనకు విజయ్ తో చేయాలని చెప్పింది. ఒక్క కన్ను గీటుతో నైట్ కు నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్… విజయ్‌ దేవరకొండతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని ఫోటో షేర్ చేసి చెప్పింది. అయితే వీరంతా ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోయిన్లు. అయితే ఈ లిస్ట్ లో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరిపోయింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

మంచు లక్ష్మీ తాజాగా ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అనే షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా నీకు సెలబ్రిటీస్ లో ఎవరైనా క్రష్ ఉన్నారా? అని అడుగగా దానికి రకుల్ తెలుగులో విజయ్ దేవరకొండ.. హిందీలో రణవీర్ సింగ్ అంటే క్రష్ అని చెప్పేసింది ఈ భామ. మొత్తానికి యంగ్ హీరోయిన్స్ ఆ కాదు స్టార్ హీరోయిన్స్ కూడా విజయ్ కు ఫిదా అవుతున్నారంటే మనోడి ఫేట్ మాములుగా లేదని చెప్పొచ్చు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + thirteen =