మరో కొత్త సినిమాకు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్

Latest Telugu Movies News, Naga Shaurya New Movie News, Naga Shaurya Next Film Updates, Naga Shaurya Next project Details, Naga Shaurya Signs a New Movie, Naga Shaurya Signs A Woman Direction Film, Naga Shaurya Signs His Next, Naga Shaurya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగశౌర్య. ఇప్పటికే రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్యకి జంట‌గా మెహ్రీన్ నటిస్తోంది. పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగశౌర్య. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో తను మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + four =