ఏఎన్నార్ ‘బుద్ధిమంతుడు’కు 50 ఏళ్ళు

50 Years Completed For ANR Buddhimanthudu Telugu Movie, 50 Years For ANR Super Hit Movie Buddhimanthudu, ANR Buddhimanthudu Completes 50 Years, Buddhimanthudu Movie Completed 50 Years, Buddhimanthudu Movie Updates, Buddhimanthudu Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

“మానవసేవే మాధవసేవ” అనే సూక్తితో రూపొందిన చిత్రం ‘బుద్ధిమంతుడు’. ఒక వైపు దైవమే సర్వస్వం అనుకునే భక్తుడు మాధవాచార్యగా, మరోవైపు సాటి మనిషిలో దైవాన్ని చూసే గోపిగా… ఇలా రెండు పార్శ్వాలున్న అన్న‌ద‌మ్ముల పాత్ర‌ల్లో క‌నిపించి జననీరాజనాలు అందుకున్నారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. లెజండరీ డైరెక్టర్ బాపు తెరకెక్కించిన ఈ సినిమాలో విజయనిర్మల కథానాయికగా నటించారు. నాగభూషణం, కృష్ణంరాజు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య, ‘సాక్షి’ రంగారావు, దేవదాస్ కనకాల, సూర్యకాంతం, సంధ్యారాణి, శాంతకుమారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా… శోభన్‌బాబు శ్రీ‌కృష్ణుడుగా ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఆరుద్ర‌, దాశరధి, కొసరాజు గీత‌ర‌చ‌న‌కు… వీనుల విందైన బాణీలు సమకూర్చారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కె.వి.మహదేవన్. వాటిలో “గుట్ట మీద గువ్వా కూసింది”, “టాటా వీడుకోలు గుడ్‌బై ఇంక సెలవు”, “భూమ్మీద సుఖపడితే తప్పులేదురా”, “నను పాలింపగ నడచి వచ్చితివా”, “తోటలోకి రాకురా”, “బడిలో ఏముంది” వంటి పాటలు జనాదరణ పొందాయి. ఈ చిత్రాన్ని తమిళంలో ‘మనిద‌నుమ్ దైవమాగ‌లామ్’(1975) పేరుతోనూ… హిందీలో ‘పరమాత్మ’(1994) టైటిల్‌తోనూ పునర్నిర్మించారు. చిత్ర కల్పన పతాకంపై ఎన్.ఎస్.మూర్తి నిర్మించిన ‘బుద్ధిమంతుడు’… 1969 సెప్టెంబర్ 20న విడుదలై ఘన విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here