సంక్రాంతికే సిద్దమవుతున్న కళ్యాణ్ రామ్

2019 Latest Telugu Film News, Kalyan Ram to Release His Film For Sankranthi, Kalyan Ram New Movie Release Date, Enta Manchivadavura Movie Releasing For This Sankranthi, Sankranthi Releasing Movies, Enta Manchivadavura Movie Latest News, Enta Manchivadavura Movie, Enta Manchivadavura Movie Release Date Fixed,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Kalyan Ram To Release His Film For Sankranthi

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. రెండో షెడ్యూల్ ను ఈ నెల 26 నుండి ప్రారంభించనున్నారు. రాజమండ్రి, తణుకు పరిసర ప్రాంతాల్లో జరగనున్న ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో, నవంబర్‌లో చిక్‌మంగళూర్‌ల్లో జరిగే షూటింగ్స్‌తో చిత్రం పూర్తవుతుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే సంక్రాంతి పోరు భారీగా ఉండగా.. ఈ సంక్రాంతి బరిలోనే దిగాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి వస్తున్న భారీ సినిమాలను కళ్యాణ్ రామ్ తట్టుకుంటుందా చూద్దాం ఏం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్‌ కథానాయికగా నటిస్తుంది. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 7 =