కాలేజ్ ప్రొఫెస‌ర్‌గా లేడీ సూప‌ర్‌స్టార్‌?

2019 Latest Telugu Film News, Vijayashanthi as Professor in Sarileru Neekevvaru, Vijayashanthi as Professor, Sarileru Neekevvaru Movie Latest News, Vijayashanti playing college professor in Mahesh Babu Sarileru Neekevvaru, Vijayashanthi As A professor, Vijayashanti is set to comeback as a professor, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు అప్‌క‌మింగ్ ఫిల్మ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో అల‌నాటి లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రాముల‌మ్మ పోషించే పాత్ర‌పై ఆ మ‌ధ్య ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం… ఇందులో విజ‌య‌శాంతి కాలేజ్ ప్రొఫెస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసింది. అంతేకాదు… ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ లా కాలేజ్‌లో జ‌రుగుతున్న చిత్రీక‌ర‌ణ‌లో ఆమె పాల్గొంటున్నార‌ని స‌మాచారం. కాగా… ఆర్మీ మేజ‌ర్ అయిన మ‌హేష్ పాత్ర‌కి, కాలేజ్ ప్రొఫెస‌ర్ అయిన విజ‌య‌శాంతి పాత్ర‌కి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదివ‌ర‌కు… `ప్ర‌తిఘ‌ట‌న‌`(1985) చిత్రంలో లెక్చ‌ర‌ర్‌గా క‌నిపించి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న విజ‌య‌శాంతి… ఇప్పుడు కాలేజ్ ప్రొఫెస‌ర్‌గానూ మురిపిస్తారేమో తెలియాలంటే 2020 సంక్రాంతి వ‌ర‌కు వేచిచూడాల్సిందే. [subscribe] [youtube_video videoid=ysbe4JodbNM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =