స్టార్ డమ్ కు సరికొత్త నిర్వచనాలు చెబుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కు హ్యాపీ బర్త్ డే

2019 Latest Telugu Film News, Telugu FilmNagar Wishes a Very Happy Birthday to Super Star Mahesh Babu, 2019 Latest Telugu Film News, Mahesh Babu Turns 44 5 Most Iconic Performances Of The Superstar, 44 Years For Mahesh Babu, Mahesh Babu latest movie news, Iconic Performances Of The Superstar, Superstar Mahesh babu Performances, Happy Birthday Mahesh Babu, Spyder star Mahesh Babu turns 44 today, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Super Star Mahesh Babu Recieved Wishes, From Telugu Filmnagar

స్టార్ డమ్… హీరోలు అయిన ప్రతి ఒక్కరూ స్టార్స్ కాలేరు. స్టార్ కావటానికి నటన ఒక్కటే కొలమానంగా కాదు. నటనతో పాటు ఒక ప్రత్యేక తరహా స్టైల్, బాడీ లాంగ్వేజ్, అందం, పర్సనల్ హేవియర్,ఫినామినల్ హిట్స్ వంటి చాలా విషయాలు కలిసి రావాలి. అలా ఎన్నో అద్భుతాలు కల గలిస్తేనే ఒక స్టార్ ఆవిర్భావం జరుగుతుంది. అలాంటి స్టార్స్ లో కూడా rare and unique అనిపించుకోవటం అందరికీ సాధ్యం కాదు. కానీ అది తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా అందరిలొ ఒకడిలా కాకుండా అందరికంటే భిన్నంగా ఎదుగుతూ, వెలుగుతూ “సూపర్ స్టార్” అనే అభినందనకు అన్ని విధాలా అర్హుడు నిపించుకుంటున్నాడు మహేష్ బాబు. సంథింగ్ స్పెషల్ అనదగిన ట్రాక్ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకు మాత్రమే సొంతం… అదెలాగంటే… చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా రెండు దశల్లోనూ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేసిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ మహేష్ బాబు మాత్రమే. ఆడవాళ్ళలో ఆ క్రెడిట్ ఆల్ ఇండియా బ్యూటీ క్వీన్ శ్రీదేవికి దక్కితే మగవాళ్ళలో ఆ ఘనత one and only మహేష్ బాబుకే దక్కింది. 2019 తో నటుడిగా నలభై ఏళ్లు, కథా నాయకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఆగస్టు 9 తో వ్యక్తిగా 44 పూర్తిచేసుకుని 45 వ పడి లో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చైల్డ్ స్టార్ గా, సూపర్ స్టార్ గా తన 40 ఏళ్ల నట ప్రస్థానంలోని జయాపజయాలను, విషయ విశేషాలను విశ్లేషించుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భళా అనిపించుకునన్న బాలచంద్రుడు:

1975 ఆగస్టు 9న ఘట్టమనేని కృష్ణ, ఇందిరా దంపతుల నాలుగో సంతానంగా పుట్టిన మహేష్ బాబు 1979 లో తన 4 వ యేట దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో “నీడ” చిత్రంలో తన అన్నయ్య రమేష్ బాబు తో కలిసి నటించాడు. తరువాత నాలుగేళ్లకు 1983 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ” పోరాటం”లో బాల నటుడిగా మంచి ప్రతిభ కనపరిచాడు. ఆ తరువాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన “శంఖారావం” రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వరుసగా మూడేళ్ల పాటు సంవత్సరానికి రెండు సినిమాలు చొప్పున సంచలనం సృష్టించాడు.1988లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బజార్ రౌడీ, కృష్ణ దర్శకత్వంలో ముగ్గురు కొడుకులు, 1989లో రామకృష్ణ దర్శకత్వంలో గూడచారి 117, కృష్ణ దర్శకత్వంలో కొడుకు దిద్దిన కాపురం చిత్రాలలో నటించాడు. ముఖ్యంగా “కొడుకు దిద్దిన కాపురం”లో ద్విపాత్రాభినయం చేసి త్రూ అవుట్ డ్యూయల్ రోల్ చేసిన చైల్డ్ యాక్టర్ గా రికార్డు సృష్టించాడు. ఇక 1990లో మహేష్ నటించిన రెండు సినిమాలు తన తండ్రి దర్శకత్వంలో రూపొందినవే కావటం విశేషం. అన్నా- తమ్ముడు, బాలచంద్రుడు. కాగా “నీడ”నుండి “అన్నా-తమ్ముడు” వరకు తండ్రి కృష్ణ గారితోనూ లేదా అన్నయ్య రమేష్ కాంబినేషన్లోనో మాత్రమే నటించిన మహేష్ బాబు బాల చంద్రుడులో సోలో చైల్డ్ హీరోగా టైటిల్ రోల్ పోషించటం విశేషం. ఇక చైల్డ్ స్టార్ గా మహేష్ బాబుకు ఇదే ఆఖరి చిత్రం. అద్భుతమైన టైమింగ్ తో, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో పెద్ద పెద్ద దర్శకులు, సీనియర్ నటీనటులే ఆశ్చర్యపోయే స్థాయిలో
కెమెరా ముందు ఎలాంటి అదురూ బెదురూ లేకుండా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎవరూ చూడనంతటి స్టార్ డమ్ ను చూసిన మహేష్ బాబు” “బాలచంద్రుడు” వంటి హిట్ తరువాత గొప్ప క్రేజ్ ఏర్పడినప్పటికీ పై చదువుల కోసం యాక్టింగ్ కెరీర్ కు ఇంటర్వెల్ కార్డు వేశాడు.1990లో “బాలచంద్రుడు” గా నిష్క్రమించి తొమ్మిదేళ్లపాటు నటనకు దూరంగా ఉండి 1999లో ” రాజకుమారుడు” గా పునః ప్రవేశం చేసిన మహేష్ బాబుకు ఘన స్వాగతం, ఘన విజయము లభించాయి. ఇక హీరోగా నాటి తొలి చిత్రం “రాజకుమారుడు నుండి నిన్నటి 25 వ చిత్రం” మహర్షి” వరకు మహేష్ బాబు ప్రస్థాన విశేషాలు ఎలా సాగాయో చూద్దాం.

కాలచక్రంలో అప్పుడే 20 ఏళ్లు దొర్లిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు పరిచయమై 20 ఏళ్లు పూర్తయ్యాయి అంటే నమ్మలేనట్లుగా అనిపిస్తోంది. మహేష్ బాబు హీరోగా ఆయన తొలి చిత్రం “ రాజకుమారుడు” విడుదలై 20 ఏళ్లు పూర్తయ్యాయి. 1999, జూలై 30 న విడుదలైంది రాజకుమారుడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అగ్రనిర్మాత సి. అశ్వినీ దత్ నిర్మించిన ” రాజకుమారుడు” చిత్రం ద్వారా మహేష్ బాబు హీరోగా పరిచయమైనప్పటి ప్రారంభోత్సవ దృశ్యాలు, ఆనాటి కోలాహలం, ఆ సందడి, ఉరకలేసిన అభిమానుల ఉత్సాహం – ఇవన్నీ నిన్న మొన్నటి
ముచ్చట్లుగా కళ్ల ముందు కదలాడుతున్నాయి. కానీ ఇంతలోనే కాల ప్రవాహ వేగంలో 20 వసంతాలు కదిలిపోయాయి. ఈ 20 ఏళ్లలో హీరోగా మహేష్ బాబు కూడా అనూహ్యంగా, అత్యున్నతంగా ఎదిగారు. తొలిరోజుల్లో మహేష్ బాబు అనే పేరుకు ముందు ” ప్రిన్స్” అనే ప్రిఫిక్స్ ఉండేది. కానీ కాలక్రమంలో అందిపుచ్చుకున్న విజయాల స్థాయిని బట్టి, పెరుగుతున్న ఇమేజ్ ని బట్టి ప్రిన్స్ స్థానంలో ” సూపర్ స్టార్” వచ్చి చేరింది. Yes… now he is the most deserving celebrity for the title Super Star. కాగా ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో మహేష్ బాబుకు జయాపజయాల మిశ్రమ ఫలితాలు లభించాయి.25 చిత్రాల తన retrospective లో 10 ఘన విజయాలు, 7 యావరేజ్ సక్సెస్ లు , 8 ప్లాపులు కనిపిస్తాయి.

పాతికలో పది సూపర్ హిట్స్:

తొలి చిత్రం “ రాజకుమారుడు ”తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు కు 20 ఏళ్ల ప్రయాణంలో నాలుగవ చిత్రం “మురారి” , ఏడో చిత్రం “ఒక్కడు”, 12 వ చిత్రం” పోకిరి”, 16 వ చిత్రం” “దూకుడు”, 17 వ చిత్రం “బిజినెస్ మాన్” , 18 వ చిత్రం “సీతమ్మ వాకిట్లో ఇప్పుడు సిరిమల్లె చెట్టు, 21 వ చిత్రం “శ్రీమంతుడు”, 24 వ చిత్రం “భరత్ అనే నేను”, 25 వ చిత్రం “మహర్షి ” రూపంలో మొత్తం 10 బ్లాక్ బస్టర్ హిట్స్ లభించాయి. అయితే ఎనిమిది యావరేజ్ హిట్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అతడు, ఖలేజా చిత్రాలు థియేటరికల్గా నిరాశ పరిచినప్పటికీ హోమ్ థియేటర్ అయిన టీవీ చానల్స్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. మొత్తం మీద 20 సంవత్సరాలలో 25 చిత్రాలు చేసి సంఖ్యాపరంగా, సక్సెస్ పరంగా అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్న మహేష్ బాబును ” సరిలేరు నీకెవ్వరు” అంటూ ఆర్మీ మేజర్ గా అద్భుతమైన పాత్రలో తీర్చిదిద్దుతున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. భరత్ అనే నేను, మహర్షి చిత్రాల ఘన విజయం తర్వాత ” సరిలేరు నీకెవ్వరు” తో మరో హట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు అసంఖ్యాక మహేష్ బాబు అభిమానులు.2020 జనవరిలో విడుదల కానున్న “సరిలేరు నీకెవ్వరు” అభిమానుల అంచనాలను అందుకుంటుందని ఆశిద్దాం.

 

మరెన్నో విశేషాల సమాహారం మహేష్ బాబు కెరీర్:

మహేష్ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన‌ నటీమణులు:

మ‌హేష్ సినిమాలు ప‌లువురు న‌టీమ‌ణుల రీ-ఎంట్రీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచాయి. ‘రాజకుమారుడు’ సినిమాతో సీనియ‌ర్ యాక్ట్ర‌స్‌ సుమలత, ‘నిజం’తో మ‌రో సీనియ‌ర్ యాక్ట్ర‌స్ తాళ్ళూరి రామేశ్వరి, ‘అర్జున్’తో సీనియ‌ర్ న‌టీమ‌ణి, ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సరిత రీ-ఎంట్రీ ఇవ్వగా… ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’తో లేడీ సూప‌ర్ స్టార్‌ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే తెలుగమ్మాయి అంజ‌లి కూడా `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`తోనే తెలుగునాట మ‌ళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చింది.

మహేష్ సినిమాల‌తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీస్:

సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమాల‌తో ప‌లువురు బాలీవుడ్ బ్యూటీస్ తెలుగునాట క‌థానాయిక‌లుగా తొలి అడుగులు వేశారు. ‘వంశీ’తో నమ్రతా శిరోద్కర్, ‘మురారి’తో సోనాలి బెంద్రే, ‘టక్కరి దొంగ’తో బిపాషా బసు, లిసారే, ‘అతిథి’తో అమృతా రావ్, ‘1:నేనొక్కడినే’తో కృతీ సనన్, ‘భరత్ అనే నేను’తో కియారా అద్వాని హీరోయిన్స్‌గా టాలీవుడ్‌లో  ఎంట్రీ ఇచ్చారు.

మహేష్‌తో ఎవ‌రెన్ని?:

మ‌హేష్ కెరీర్‌లో అత్య‌ధిక సినిమాల‌కు ప‌నిచేసిన సంగీత ద‌ర్శ‌కుడిగా  మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. మ‌హేష్ తొలి చిత్రం `రాజ‌కుమారుడు` మొద‌లుకుని  ‘వంశీ’, ‘మురారి’, ‘టక్కరి దొంగ’, ‘బాబీ’, ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘అతడు’, ‘పోకిరి’, ‘అతిథి’, ‘ఖలేజా’ వ‌ర‌కు 11 చిత్రాల‌కు మ‌ణి స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. ఆ యా చిత్రాల‌న్నీ మ్యూజిక‌ల్‌గా మెప్పించాయి కూడా. ఇక‌ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’కి మ‌ణి అందించిన నేప‌థ్య‌సంగీతం ఎస్సెట్‌గా నిల‌చింది. ఇక న‌టుల విష‌యానికి వ‌స్తే… ప్ర‌కాష్ రాజ్ అత్య‌ధిక చిత్రాల్లో మ‌హేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక క‌థానాయిక‌ల్లో స‌మంత ముచ్చ‌ట‌గా మూడుసార్లు మ‌హేష్‌కి జోడీగా న‌టించింది. ద‌ర్శ‌కుల్లో కృష్ణ ఐదు చిత్రాల‌ను రూపొందించ‌గా… గుణ‌శేఖ‌ర్ మూడు చిత్రాల‌ను తెర‌కెక్కించాడు. నిర్మాత‌ల్లో సి.అశ్వ‌నీద‌త్‌, `దిల్‌` రాజు,  14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు మూడేసి చిత్రాల‌ను నిర్మించారు.  ఇక బాల‌న‌టుడిగా న‌టించిన సినిమాల‌తో స‌హా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే… ప‌ద్మాల‌య సంస్థ ఎక్కువ చిత్రాలు నిర్మించింద‌నుకోవాలి.

వాయిస్ ఓవ‌ర్‌తోనూ… :

తన సహనటులతో   ఎంతో సఖ్యతగా ఉండే మహేష్ బాబు… పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’కు, ఎన్టీఆర్ నటించిన ‘బాద్‌షా’కు వాయిస్ ఓవర్ అందించ‌డం విశేషం. అంతేకాదు… తన తండ్రి కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’ సినిమాతో పాటు… తన సోదరి మంజుల తొలిసారి మెగాఫోన్ పట్టిన ‘మనసుకు నచ్చింది’ సినిమాకు కూడా వాయిస్ ఓవర్ అందించి అల‌రించారు మ‌హేష్‌.

నిర్మాణ రంగంలోనూ… :

మ‌హేష్ నిర్మాణ రంగంలోనూ త‌న‌దైన ముద్ర వేశారు. `శ్రీ‌మంతుడు`, `బ్ర‌హ్మోత్స‌వం` సినిమా కోసం భాగ‌స్వామిగా వ్య‌హ‌రించిన మ‌హేష్‌… ప్ర‌స్తుతం `మేజ‌ర్‌`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి కూడా నిర్మాణ భాగ‌స్వామ్యం చేప‌ట్టారు. అలాగే… మ‌ల్టీఫ్లెక్స్‌ ఏఎంబీ సినిమాస్‌లోనూ మ‌హేష్ భాగ‌స్వామ్యం ఉంది.

మహేష్ అవార్డులు:

ఈ త‌రంలో అత్య‌ధిక నంది పుర‌స్కారాలు అందుకున్న క‌థానాయ‌కుడిగా మ‌హేష్‌కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ‘రాజకుమారుడు’తో బెస్ట్ మేల్ డెబ్యూగా నంది అవార్డు అందుకున్న మ‌హేష్‌… ‘మురారి’, ‘టక్కరి దొంగ’, ‘అర్జున్’ చిత్రాలకు స్పెషల్ జ్యూరీ విభాగంలోనూ… ‘నిజం’, ‘అతడు’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’  చిత్రాలకు ఉత్తమ నటుడి  విభాగంలోనూ నంది అవార్డులను కైవసం చేసుకున్నారు మహేష్. మొత్తంగా… 8 నంది పుర‌స్కారాలు మ‌హేష్ ఖాతాలో ఉన్నాయ‌న్న‌మాట‌. ఇక 5 ఫిల్మ్‌ఫేర్ పుర‌స్క‌రాల‌తో పాటు ప‌లు ప్రైవేట్ సంస్థ‌ల అవార్డులు కూడా మ‌హేష్ ఖాతాలో ఉన్నాయి.

యాడ్ వ‌ర‌ల్డ్ సెన్సేష‌న్‌:

మహేష్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు.  థమ్సప్, యూనివర్సల్ సెల్ స్టోర్, నవరత్న హెయిర్ ఆయిల్, అమృతాంజన్, ప్రోవోగ్, ఐటిసి వివేల్, జోస్ అలుక్కాస్, ఐడియా సెల్యూలర్, సంతూర్ సోప్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, రాయల్ స్టాగ్, రెయిన్‌బో హాస్పిటల్స్, టివీఎస్ మోటార్ కంపెనీ, మహీంద్రా ట్రాక్ట‌ర్స్‌, పారగాన్ ఫుట్ వేర్, టాటా స్కై, ఇంటెక్స్ మొబైల్స్, డెన్వర్ ప‌ర్‌ఫ్యూమ్‌, క్లోజప్ టూత్ పేస్ట్, యుప్ టీవీ, అభి బ‌స్‌, ప్రోటీనెక్స్‌… ఇలా ప‌లు బ్రాండ్‌ల‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి యాడ్ వ‌ర‌ల్డ్ సెన్సేష‌న్ అయ్యారు మ‌హేష్‌.

వీటితో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉండే మహేష్… తన ట్విట్టర్ అకౌంట్‌లో 7.92 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉండడం విశేషం. అలాగే… “టైమ్స్ 50 మోస్ట్ డిజరబుల్ మెన్ ఇన్ ఇండియా”కు సంబంధించి 2013లో బాలీవుడ్ స్టార్స్ ను కూడా వెనక్కి నెట్టి నంబ‌ర్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు ఈ సూపర్ స్టార్.

మున్ముందు… ఈ సూప‌ర్ స్టార్ జైత్ర‌యాత్ర‌లో ఇంకెన్ని మైలురాళ్ళు చేర‌తాయో చూడాలి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =