ట్రోల్స్ చూసి ఇప్పుడు నవ్వుకుంటున్నా -సమంత

Samantha Akkineni Responds To Trolls In A Latest Interview,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Samantha Akkineni Latest Updates,Samantha Akkineni Strong Responds To Trolls,Samantha About Her Trolls on Social Media,Samantha About Social Media Trolls
Samantha Akkineni Responds To Trolls In A Latest Interview

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పై ట్రోల్స్ రావడం సాధారణమైన విషయమే. ఇక కెరీర్ స్టార్టింగ్ లో ఈ ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకొని మానసికంగా బాధపడే వాళ్లు.. కానీ ఆ తరువాత ట్రోల్స్ కూడా అలవాటై వాటిని సీరియస్ తీసుకోవడం మానేశారు. ఇప్పుడు ఈ ట్రోల్స్ పై.. ట్రోల్స్ చేసే వారిపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తనదైన శైలిలో స్పందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జులై 5వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇక ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతను ట్రోల్స్ పై అడగగా… విమర్శలు నన్ను తొలుత చాలా బాధించేవి. ఉదయం నిద్రలేచి కామెంట్స్‌ చూసేదాన్ని. అవి నన్ను మానసికంగా చాలా బాధపెట్టేవి. మెంటల్‌గా స్థిరంగా ఉండలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను మారిపోయా. అన్నింటినీ ఫన్నీగా తీసుకుంటున్నా. ఏ ట్రోల్స్‌ వల్లైతే బాధపడ్డానో ఇప్పుడు వాటిని చూసే నవ్వుకుంటున్నా అన్నారు. ట్రోల్స్‌ను కూడా ఎంజాయ్‌ చేస్తున్నా అంటున్నారు. ఇప్పుడు ఓ పోస్ట్‌, ఫొటో షేర్‌ చేసే ముందు దానికి ఎలాంటి విమర్శలు వస్తాయో కూడా ముందే ఊహిస్తున్నానని చెప్పింది సామ్.

మరి సామ్ ట్రోల్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో గతంలో తను ఇచ్చిన కౌంటర్లను బట్టే చెప్పొచ్చు. ఎలాంటి సంకోచం లేకుండా ట్రోల్స్ చేసిన వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేస్తుంది.

[subscribe]

[youtube_video videoid=htVUZR1nI0s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fifteen =