గీత గోవిందం సినిమా తరువాత భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ఓ అప్ డేట్ ఇచ్చారు. మరో 50 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జులై 26న రిలీజ్ కానుందని ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి.. ‘కడలల్లే వేచే కనులే’.. ‘నీ నీలి కళ్లల్లో’ అనే రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వగా ఇప్పుడు తాజాగా మరో లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. ‘ఇంట్లో పెళ్లి’ అనే లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.
కాగా లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్ సినిమా, మైత్రీ మూవీమేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తుండగా.. రష్మిక మందన మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది. మరి గీతగోవిందం సినిమాతో హిట్ కొట్టిన.. ఈ హిట్ కాంబో.. డియర్ కామ్రెడ్ సినిమాతో హిట్ అందుకుంటుందో.. లేదో.. చూద్దాం..
[youtube_video videoid=n3AqEHg6ofI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: