`ఎన్జీకే`… ర‌కుల్‌కి అందుకే స్పెష‌ల్‌

NGK A Very Special Movie For Rakul Preet,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rakul Preet About NGK Movie,Rakul Preet Says NGK is Special Movie,NGK Telugu Movie Latest Updates,Rakul Preet New Movie Updates
NGK A Very Special Movie For Rakul Preet

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న‌ స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్… ఈ శుక్ర‌వారం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ఎన్జీకేతో అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తోంది. కాగా… ఈ సినిమాకి సంబంధించి ర‌కుల్‌కి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ముడిప‌డి ఉంద‌నే చెప్పాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… స‌రిగ్గా ప‌దేళ్ళ క్రితం విడుద‌లైన‌ కన్నడ చిత్రం ‘గిల్లి’ (2009)తో ర‌కుల్ వెండితెరకు క‌థానాయిక‌గా పరిచయమైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా… సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘7/జి బృందావన్ కాలనీ’(2004)కి రీమేక్‌గా తెరకెక్కింది. సోనియా అగ‌ర్వాల్ పోషించిన పాత్ర‌లో అక్క‌డ‌ ర‌కుల్ క‌నిపించింది. అంతేకాదు… తొలి చిత్రంతోనే న‌టిగా మంచి మార్కులు సంపాదించింది. ఆ సినిమా తీసుకువ‌చ్చిన గుర్తింపుతోనే… తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసి… అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ర‌కుల్‌.

క‌ట్ చేస్తే… మ‌ళ్ళీ ప‌దేళ్ళ త‌రువాత‌ తన తొలి చిత్రం మాతృకను తెరకెక్కించిన సెల్వరాఘవన్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు ఎన్జీకే చేసింది ర‌కుల్‌. ఇందులో కోలీవుడ్ స్టార్ సూర్యకి జోడీగా న‌టించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. సాధారణంగా తన సినిమాల్లో కథానాయికలకు ప్రాధాన్యం ఉండే పాత్రలను డిజైన్ చేసే సెల్వ రాఘవన్… ఈ చిత్రంలోనూ రకుల్ కోసం ఓ ఆస‌క్తిక‌ర‌మైన‌ పాత్రను డిజైన్ చేశాడు. ఆ పాత్ర‌లో ర‌కుల్ ఒదిగిపోయింద‌ని ఇప్పుడు ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. మొత్త‌మ్మీద‌… ర‌కుల్ త‌న తొలి చిత్ర మాతృక ద‌ర్శ‌కుడితో ప‌దేళ్ళ త‌రువాత క‌ల‌సి ప‌నిచేయ‌డం ఆస‌క్తిక‌రమ‌నే చెప్పాలి.

[subscribe]

[youtube_video videoid=070ChKvMCEs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + thirteen =