లైఫ్ చేంజింగ్ అనౌన్స్ మెంట్ రివీల్

Manchu Vishnu and Veronica give birth to a baby boy,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manchu Vishnu and Veronica gives birth To Little Angel,Manchu Vishnu Couple To Become Parents Again,Actor Manchu Vishnu Latest Updates,Manchu Vishnu Wife Gives Birth to Another Baby
Manchu Vishnu and Veronica give birth to a baby boy

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రేపు తన లైఫ్ చేంజింగ్ అనౌన్స్ మెంట్ గురించి చెబుతానని మంచు విష్ణు నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక మంచు విష్ణు చేసిన ట్వీట్ ను చూసి తన సినిమాలకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఏదో ఉండబోతుందేమో అని అనుకున్నారు. కానీ ఈరోజు ఆ డౌట్లకు క్లారిటీ ఇచ్చేశాడు. అదేంటంటే.. తాను నాలుగో బిడ్డకు తండ్రి కాననున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు విష్ణు.

“ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్. ఇది విన్నీ స్వస్థలం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. అరి, వివి, అవ్రామ్ ల తరువాత నాలుగో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుందని చెప్పేందుకు సంతోషిస్తున్నా” అని పేర్కొంటూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. విష్ణు దంపతులకు తొలుత అరియానా, వివియానా కవలలు, ఆ తరువాత అవ్రామ్ అనే బాబు జన్మించాడన్న సంగతి తెలిసిందే. ఇక మంచు విష్ణుకు అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం మంచు విష్ణు.. ‘ఓటర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తిక్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకలు ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు ఆయన ‘కన్నప్ప’ అనే సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది.

[subscribe]


[youtube_video videoid=CBH6tNnmd0w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =