ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ల ‘దొరసాని’ షూటింగ్ పూర్తి

Anand Deverakonda Dorasani Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anand Deverakonda and Sivatmika New Movie Updates,Dorasani Movie Shooting Latest Updates,Anand Deverakonda Dorasani Movie Shooting Completed,Anand Deverakonda New Movie News
Anand Deverakonda Dorasani Movie Shoot Wrapped Up

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక జంటగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతోనే ఇద్దరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమైన ఈసినిమా అప్పటినుండి షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ‘దొరసాని’ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షార్ట్‌ ఫిలింస్‌తో సత్తా చాటిన కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొరసాని’ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్‌ రంగినేని నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా.. ముఖ్యంగా తెలంగాణ భాష సంస్కృతులను ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందించారు.

మరివిజయ్ దేవరకొండ తన సహజమైన నటనతో మంచి పేరు సంపాదించుకొని ప్రస్తుతం సక్సెస్ బాటలో నడుస్తున్నాడు. మరి ఆనంద్ దేవరకొండ తన నటనతో ఎంత వరకూ మెప్పిస్తాడో.. అన్నకు తగ్గ తమ్ముడు అని అనిపించుకుంటాడో లేదో..చూద్దాం..?

[subscribe]


[youtube_video videoid=8bpTQ7cL7Rs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.