పంతం
చిత్రంలో జంటగా నటించి అలరించిన గోపీచంద్, మెహరీన్ జోడీ… మరోసారి కలసి నటించేందుకు సిద్ధమవుతోందా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ సర్కిల్స్‌లో.ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ విశాల్‌తో పలు యాక్షన్ ఎంటర్ టైనర్స్‌ను తెరకెక్కించిన తమిళ డైరెక్టర్ తిరు… ప్రస్తుతం గోపీచంద్‌తో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ నటిస్తుండగా…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెయిన్ హీరోయిన్ గా మెహరీన్ ఎంపిక అయ్యిందని సమాచారం. ఇటీవల దర్శకుడు తిరు… మెహరీన్‌ను సంప్రదించి కథను వినిపించాడని, కథ – పాత్ర తీరు తెన్నులు నచ్చడంతో మెహరీన్ కూడా వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. త్వరలోనే మెహరీన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఎఫ్ 2
ఘనవిజయంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన మెహరీన్… తదుపరి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే… స్వల్ప విరామం తరువాత కొత్త చిత్రాలకు అంగీకారం తెలుపుతోందని ఇన్‌సైడ్ సోర్స్ టాక్.
[subscribe]
[youtube_video videoid=NFBHEw5dfTY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: