రెండు ప‌ద‌హారుల ప్రాయంలో అందాల‌ స‌మంత‌

Telugu FilmNagar Wishes Samantha Akkineni A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Wishing a Very Happy Birthday To Samantha,Samantha Akkineni Birthday Special News,Samantha Akkineni Latest Updates,#HBDSamanthaAkkineni
Telugu FilmNagar Wishes Samantha Akkineni A Very Happy Birthday

సమంత… అదృష్టం అనే మాట‌కు ప‌ర్యాయ‌ప‌దంలా నిల‌చిన అందం, అభిన‌యాల స‌మ్మేళ‌నం. అలాగే… ఈ తరం కథానాయికలలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోయిన్‌. తెలుగు నాట తిరుగులేని నాయిక అనిపించుకోవడమే కాదు… తన మాతృభాష తమిళంలోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది సామ్‌. ‘ఏ మాయ చేసావే’ తో మొదలుకుని ‘మజిలీ’ వరకు పలు చిత్రాల్లో తన అభినయంతో మురిపించింది. ప‌లు పుర‌స్కారాల‌ను త‌న కైవ‌సం చేసుకుంది. అంతేకాదు… పలువురు కథానాయకుల కెరీర్ బెస్ట్ మూవీస్‌లో భాగమైంది. తాజాగా త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌కి కూడా మ‌జిలీ రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందించింది. మరోవైపు ఏడాదికో ఘనవిజయాన్ని తన సొంతం చేసుకుంటూ తారాప‌థంలో దూసుకుపోతోంది. తన అభినయం, అంకిత‌భావం, స్టైల్, ఎంచుకునే పాత్రలతోనే ఈ విజయాలు సామ్‌ సొంతమవుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్‌గా పేరు తెచ్చుకున్న సమంత… ప్రస్తుతం లేడీ డైరెక్ట‌ర్‌ బి.నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఓ బేబీ! ఎంత సక్కగున్నావే’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు… త‌న మావ‌య్య‌, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ‘మన్మథుడు 2’లో కూడా ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న కుంద‌న‌పు బొమ్మ సామ్ … మున్ముందు కూడా ఇదే శైలిని కొన‌సాగించాల‌ని… ఆమెకు జన్మదిన శుభాకాంక్ష‌లు తెలియ జేస్తోంది ది తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్‌.

[subscribe]


[youtube_video videoid=BG88O8TBt5k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + twenty =