యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘గీతగోవిందం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఈ జంట కలసి నటించిన సినిమా కావడంతో… ‘డియర్ కామ్రేడ్’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు బిగ్ బెన్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మించింది. మళయాళ చిత్రం ‘ప్రేతమ్’ ఫేం శ్రుతి రామచంద్రన్ ఓ కీలకపాత్రను పోషించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం… తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. అలాగే… ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
కాగా… ఇందులో సమాజం పట్ల బాధ్యత ఉన్న యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపించనుండగా… క్రికెటర్ లిల్లీ పాత్రలో రష్మిక దర్శనమివ్వనుంది. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[subscribe]
[youtube_video videoid=4BRnD6to5dY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: