సూప‌ర్ స్టార్‌ కృష్ణ ‘శభాష్ సత్యం’కి 50 ఏళ్ళు

50 Years For Super Star Krishna Sabash Satyam Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Super Star Krishna Sabash Satyam Movie Latest Updates,50 Years For Sabash Satyam Movie,Super Star Krishna Sabash Satyam Movie Turns 50 Years,50 Years Completed For Super Star Krishna Sabash Satyam Movie
50 Years For Super Star Krishna Sabash Satyam Movie,

‘తేనెమనసులు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు క‌థానాయ‌కుడిగా పరిచయమై… కేవలం నాలుగేళ్ళలో 25 సినిమాలను పూర్తిచేసిన (తొలి చిత్రానికి… రెండో చిత్రానికి ఏడాదికి పైగా గ్యాప్) మొట్ట‌మొద‌టి తెలుగు హీరోగా ఘ‌న‌త చెందారు సూపర్ స్టార్ కృష్ణ. సాంఘికం, థ్రిల్లర్, యాక్షన్, జానపదం వంటి సినిమాలను చేస్తున్న ఆ రోజుల్లోనే… సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్. ఆ చిత్రమే ‘శభాష్ సత్యం’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృష్ణ నటించిన జానపద చిత్రం ‘మహాబలుడు’ విడుదలైన మరునాడే ఈ సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ కూడా విడుదల కావడం విశేషం. కృష్ణ, రాజశ్రీ నాయకానాయికలుగా జి.విశ్వనాథం దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమాలోని కథకు ద‌గ్గ‌ర‌గా హాలీవుడ్ మూవీ ‘హాలోమాన్’(2000) ఉంటుందంటే… అప్పట్లో ఈ కథను ర‌చ‌యిత ఆత్రేయ ఎంత ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. ఎండీ నాజీం నిర్మించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, నాగభూషణం, విజయలలిత, ఛాయాదేవి, రాజబాబు, ప్రభాకరరెడ్డి త‌దిత‌రులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. తన సంగీతంతో ఈ సైంటిఫిక్ మూవీని మరో స్థాయికి తీసుకుని వెళ్ళారు సంగీత ద‌ర్శ‌కుడు విజయా కృష్ణమూర్తి. 1969 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ‌భాష్ స‌త్యం… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంది.

[subscribe]


[youtube_video videoid=97Eh1bi1J7c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =