లారెన్స్ ట్రస్ట్ కు చిరు భారీ విరాళం

Mega Star Chiranjeevi Donation For Lawrence Trust,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chiranjeevi Donates Huge Price For Lawrence Trust,Mega Hero Donation To Lawrence Trust,Chiranjeevi Donates 10 Lakhs Price To Lawrence Trust
Mega Star Chiranjeevi Donation For Lawrence Trust

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన స్వీయ దర్శకత్వంలో లారెన్స్ కాంచన 3 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ముని సినిమా సీక్వెల్ లో భాగంగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా రేపు విడుదలకానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, హీరోగా ఇలా దూసుకుపోతున్న లారెన్స్ సమాజానికి తనవంతు సాయంగా భారీస్థాయిలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో లారెన్స్ సేవా దృక్పథానికి గాను.. రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు చిరంజీవి. ఈ మేరకు మెగాస్టార్ తరఫున ఆయన బావమరిది అల్లు అరవింద్ కాంచన-3 ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెక్ ను రాఘవ లారెన్స్ కు అందించారు. ఇక చిరంజీవి చేసిన సహాయానికి లారెన్స్ కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ సమకూర్చిన సంగతి తెలిసిందే. చిరు, లారెన్స్ మధ్య ముఠామేస్త్రి చిత్రం నుంచి మంచి అనుబంధం ఉంది. అంతేకాదు చిరంజీవికి లారెన్స్ పెద్ద అభిమాని కూడా.

[subscribe]


[youtube_video videoid=s01YohDdGZE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.