తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ లాస్య. ‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే లాస్య మంజునాథ్ ను వివాహం చేసుకుంది. వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా… ఇటీవల తన రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాను ప్రెగ్నెంట్ అన్న విషయం లాస్య అందరికీ తెలిపిన సంగతి తెలిసిందే. లిటిల్ హనీ ఆన్ ది వే అంటూ తన భర్త మంజునాథ్‌లో కలిసి నిండు గర్భిణిగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లాస్య. ఇప్పుడు తాజాగా ఉగాది పండుగ రోజున లాస్య మగశిశువుకు జన్మనిచ్చింది. మరి ఈ పండుగ రోజు జన్మనిచ్చిన లాస్యకు.. తన పండంటి బిడ్డకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుందాం…
[youtube_video videoid=NjtJDalL2C8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: